![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎద లోయల్లో ఇంద్రధనుస్సు'. త్వరలో ఈ సీరియల్ ముగియనుంది. మరెందుకు ఈ సీరియల్ ముగియనుంది? ప్రధాన కారణాలేంటో? ఈ సీరియల్ కథేంటో ఓ సారి చూసేద్దాం.
RK ప్రొడక్షన్స్ పై కె. రాఘవేంద్రరావు ఈ సీరియల్ ని నిర్మించారు. ఇప్పటికే ఈ సంస్థ నిర్మించిన శాంతినివాసం, మనోయజ్ఞం, అగ్నిసాక్షి, మంగమ్మ గారి మనవరాలు వంటి సీరియల్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. కాగా ఈ సీరియల్ మొదట 'పంతులమ్మ తెలుగమ్మాయి' అనే టైటిల్ ని ఖరారు చేయగా ఆ తర్వాత కొత్త టైటిల్ "ఎద లోయల్లో ఇంద్రధనస్సు" అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సీరియల్ లో ముఖ్యపాత్రలో ఏక్ నాథ్ నటిస్తున్నాడు. ఏక్ నాథ్ కి జోడిగా స్వాతి నిత్యానంద్ నటిస్తోంది. ఈమె మలయాళ నటి. మలయాళం లో చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులో స్వాతి నిత్యానంద్ కి ఇదే తొలి సీరియల్ కావడం విశేషం. 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ సాక్షి అలియాస్ రసజ్ఞ ఈ సీరియల్ లో ఏక్ నాథ్ కి సోదరిగా నటిస్తుంది. సీనియర్ యాక్టర్ రాజ్ కుమార్.. స్వాతికి మేనమామ పాత్రలో చేస్తున్నారు. ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ కి రీమేక్ గా వస్తుంది. అయితే ఈ సీరియల్ కథ 'గుప్పెడంత మనసు' సీరియల్ కథకు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో కాలేజీ ఏండి గా రిషి, కాలేజీ స్టూడెంట్ గా వసుధార.. వాళ్లిద్దరి మధ్యలో సాగే ప్రేమకథ అత్యంత వీక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే.
'ఎదలోయల్లో ఇంద్రధనస్సు' సీరియల్ లో ముఖ్య పాత్రను పోషిస్తున్న ఏక్ నాథ్ స్కూల్ ఎండీగా, స్వాతి స్కూల్ టీచర్ గా చేస్తుంది. అయితే ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లలో... కీర్తన మేడమ్ స్కూల్లో టీచర్ గా అమంతకి అపాయింట్ మెంట్ లెటర్ ఇస్తుంది. అది తీసుకెళ్ళి పార్ధుకి ఇవ్వగా.. నేను ఒప్పుకోనని అంటాడు. అయితే నేను కూడా అందరికి చెప్తానని అమంత బయటకి వెళ్తుండగా తనని వెళ్ళకుండా ఆపి.. ఏమని చెప్తావని అడుగుతాడు. నువ్వు పార్థువి కాదు దేవ్ అని అందరికి చెప్తాన్నానని అంటుంది. ఇక ఏం చెయ్యలేక ఒప్పుకుంటాడు పార్థు అలియాస్ దేవ.. ఇక కొంతమంది వచ్చి ఈ రోజే మీ స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే రేపటి నుండి మూసివేయబడుతదని చెప్తారు. ఆయనకి అలా జరిగిందని అనేలోపే.. మా డ్యూటీ మేం చేయక తప్పదని వాళ్ళు చెప్తారు. మరోవైపు అమంత, దేవ మాట్లాడుకుంటారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా లేదని చెప్పావ్. నన్ను మోసం చేసినట్టే ఆ పార్థు వాళ్ళ ఫ్యామిలీని కూడా మోసం చేస్తున్నావని అమాంత అడుగగా.. నేను కాదు ఆ ఫార్థు గాడి ఫ్యామిలీనే మోసగాళ్ళు. దుర్మార్గులు, వాళ్ళే ఆ తప్పు చేసినారని దేవ అంటాడు. అసలు పార్థు స్థానంలోకి దేవ ఎలా వచ్చాడు? పార్థు చేసిన తప్పేంటి? ఎందుకు దేవ అలా అన్నాడు.. తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. అయితే ఇలాంటి ట్విస్ట్ ల మధ్య ఈ సీరియల్ కి శుభం కార్డు పడుతుందనే వార్తలొస్తున్నాయి. ఈ ఫిబ్రవరి 17 లాస్ట్ ఎపిసోడ్ వస్తుందని తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సీరియల్ ముగియనుందా లేక అలా పుకార్లు వినిపిస్తున్నాయా తెలియాల్సి ఉంది.
![]() |
![]() |